ఎస్ఎఫ్ఐ నూతన కార్యవర్గం ఎన్నిక.
అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకులోయ) టౌన్
త్రినేత్రం న్యూస్ డిసెంబర్. 16 :
అరకు లోయ.
మండల కేంద్రము లోఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం లో,స్థానిక ఎస్ఎఫ్ఐ మండల మహా సభ జరిగింది. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మాజీ ఎస్ ఎఫ్ ఐ నాయకులు పి.రామన్న ఆధ్వర్యంలో శనివారం నుతన కార్యవర్గం ఎన్నిక జరిగిందీ. మండల అధ్యక్షుడు గా కే బిమరాజు, కార్యదర్శి గా కే .అవినాష్. జాయింట్ సెక్రటరీ గాశాంతి , దవిధ్, ఏకాగ్రివంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా సహయ కార్యదర్శి, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులూ పి.రామన్న మాట్లాడుతూ నూతంగా ఎన్నికైన మండల కార్యవర్గం విద్యార్థుల సమస్యల పరిష్కార కోసం ముందుకు కూ దూసుకు పోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 18 మంది విద్యార్థులు మృతి చెందిన అధికారులు విచారణ చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఆని చెప్పారు. అన్ని ఆశ్రమ పాఠశాలలో గతంలో మాదిరిగా హెల్త్ వలంటీర్ లని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అరకు వ్యాలీ కొ ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఏపీఆర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App