ఆపిల్ కిడ్స్ స్కూల్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు..!
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని కళ్యాణ్ నగర్ లోని ఆపిల్ కిడ్స్ స్కూల్ లో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్, రామగుండం లయన్స్ క్లబ్ మగువ అధ్యక్షురాలు గాలి సునీత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్రిస్మస్ కేకును విద్యార్థులచే కట్ చేసి సీట్లు పంచారు. అనంతరం పాస్టర్ తిమోతి పాల్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి అతిధులు మాట్లాడుతూ, ప్రపంచ మానవాళికి ఏసుక్రీస్తు జననం క్రిస్మస్ రోజున పండుగలా జరుపుకుంటారని చిన్నారి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల వేషధారణ ఆకట్టుకుంది. ఇంకా ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అరుణ, ఉపాధ్యాయుని లు, విద్యార్థులు, పేరేంట్స్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App