Early Bathukamma celebrations on Tuesday at Veenadari High School in Mandal Centre
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
ఘనంగా, అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. పాఠశాల విద్యార్థినిలు సంప్రదాయ దుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థినిలు అందరూ కలిసి వివిధ రకాలైన పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చారు. గౌరీ దేవిని పూజించారు. తదనంతరం బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఒకచోట పెట్టి కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ తిప్పర్తి శ్రీనివాస్ గౌరీదేవికి టెంకాయ సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. మహిళలందరూ సంబరంగా తొమ్మిది రోజులపాటు ఆడుతూ పాడుతూ సంబరం చేసుకుంటారు అని అన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు, ఉపాధ్యాయలు ఆంజనేయులు, రాజమౌళి, చంద్రశేఖర్, మహేందర్, మధుసూదన్, వనజ, సత్యనారాయణ రెడ్డి, సరిత, దివ్య, కవిత, దీపిక, సాహితీ, అనూష, తేజ, సువర్ణ, లక్ష్మీ మాల, సౌమ్య మరియు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.