TRINETHRAM NEWS

District Collector visited MCH

నవజాత శిశు యూనిట్ లో అవసరమైన పరికరాల ఏర్పాటుకు చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, సెప్టెంబర్ -28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బొజ్జపెల్లి సురేష్ మాదిగ

నవజాత శిశు యూనిట్ లో అవసరమైన పరికరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కోయ హర్ష  తెలిపారు.

శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ తొ కలిసి పరిశీలించారు.‌

ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న నవజాతు శిశువుల ప్రత్యేక విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు. నవజాతు శిశువుల సంరక్షణ యూనిట్ లో అవసరమైన పరికరాల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నవజాత శిశువుల సంరక్షణ యూనిట్ లో అవసరమైన 25 నుంచి 30 లక్షల గల పరికరాలను తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూపు  సహకారంతో సిఎస్ఆర్ లో భాగంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి, ప్రాజెక్టు మేనేజర్ మేరీ, నల్ల ఫౌండేషన్ నల్ల మనోహర్ రెడ్డి,జిల్లా సుపరెండెంట్ డా.శ్రీధర్, ఆర్.ఏం.ఓ.డా.రవీందర్, సీనియర్ పిల్లల వైద్యులు డా.వాసుదేవ రెడ్డి,ఆసుపత్రి సిబ్బంది,పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector visited MCH