TRINETHRAM NEWS

విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*కాఫీ విత్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జనవరి -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో ఉపాధ్యాయులు ఆత్మవిశ్వాసం పెంపొందించాలని  జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

  శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధర్మారం మండలాల ఉపాధ్యాయులతో నిర్వహించిన కాఫీ విత్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ  విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించే ఉపాధ్యాయులు ప్రశంసనీయులని కలెక్టర్ అన్నారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులలో ఉన్న ఆత్మ న్యూణ్యత భావాన్ని తొలగించి వారిలో విశ్వాసం కలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మేలు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న శ్రమ ను జిల్లా యంత్రాంగం గుర్తిస్తుందని, బాగా పని చేసే ఉపాధ్యాయులకు సిబ్బందికి జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పీఎం షేక్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App