District Collector Koya Harsha said that city development works should be ground quickly
*కార్పొరేషన్ రెవెన్యూ పెంచే దిశగా పక్కా కార్యాచరణ అమలు
*ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను 3 నెలలో పరిష్కరించాలి
*రామగుండం కార్పొరేషన్ లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
రామగుండం, ఆగస్టు-17: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నగర అభివృద్ధి పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు
శనివారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ తో కలిసి విస్తృతంగా పర్యటించారు.
రామగుండంలోని 14వ డివిజన్ లక్ష్మీపురంలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు వివరాలు మొబైల్ యాప్ లో నమోదు చేసే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల వ్యవధిలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని, ముందుగా ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పూర్తి వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు
రామగుండం లోని రమేష్ నగర్ లో ఉన్న మహాత్మ జ్యోతి బాపూలే బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ విద్యార్థిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన కలెక్టర్ గురుకులాన్ని మరో భవనానికి షిఫ్ట్ చేయాలని, సమీపంలో మరో అద్దె భవనం చూడాలని అధికారులకు సూచించారు. గురుకులాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్పొరేషన్ తరపున సంపూర్ణ సహకారం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం రామగుండం పురపాలక భవనాన్ని సందర్శించిన కలెక్టర్ తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి.యూ.ఎఫ్.ఐ.డి.సి) నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో నూతనంగా చేపట్టిన రోడ్ల , డ్రైయిన్ల నిర్మాణానికి సంబంధించి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆదాయం పెంచే విధంగా ప్రతిష్ట కార్యాచరణ అమలు చేయాలని, ఆస్తి పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని కలెక్టర్ సూచించారు.
అంతకు ముందు అంతర్గాం మండలం కుందనపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎస్ఈ శివానంద్, ఈ రామణ్, రెవెన్యూ ఇంచార్జి రాజలింగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App