పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే నిర్వహణ జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*పెద్దపల్లి లోని అమర్ నగర్ చౌరస్తా వద్ద జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్-19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
గురువారం పెద్దపల్లి పట్టణం అమర్ నగర్ చౌరస్తా వద్ద 35వ వార్డులో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే ను జిల్లా కలెక్టర్ కోయ హర్ష పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే పై దరఖాస్తుదారులకు ముందస్తు సమాచారం అందించాలని, ప్రజలు సైతం అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోని సర్వే కోసం వచ్చే ఎన్యుమరేటర్ లతో సహకరించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఎన్యుమరేటర్ లు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు సర్వే పూర్తి చేయాలని, సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు లాగిన్లు రూపొందించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.
ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితి గతి తెలిసేలా ఫోటో యాప్ లో అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు రావడానికి వీలులేదని కలెక్టర్ తెలిపారు.
ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App