కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ
త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం
కొత్తపల్లి శ్రీరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా డాక్టర్ బి.ఆర్
అంబేద్కర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ , కొత్తూరులో మెడికల్ క్యాంపు చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ మెడికల్ క్యాంపులో ట్రస్ట్ సభ్యులు కొత్తపల్లి వెంకటేష్ మరియు ట్రస్ట్ సభ్యురాలు నీలపల్లి (యానాం) వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ మల్లేశ్వరి, ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్రాలయ, వేమగిరి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి 500 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి వారిలో అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, చేతుల మీదుగా పంపిణీ చేశారు.
అనంతరం అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ట్రస్ట్ సభ్యులు కొత్తపల్లి వెంకటేష్ గారు మరియు ట్రస్ట్ సభ్యురాలు మల్లేశ్వరి, సన్మానించారు.
కొత్తూరు వార్డు మెంబర్ నల్లమిల్లి వెంకటరెడ్డి (సుమన్), సత్తి గంగిరెడ్డి , పడాల శ్రీనివాసరెడ్డి , సత్తి సత్తిరెడ్డి , పడాల వెంకటరెడ్డి, సత్తి స్వామినాథరెడ్డి, వీర రాఘవరెడ్డి (స్వామి) మరియు తదితర వైఎస్ఆర్సిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App