ఏసీబీకి చిక్కిన డిండి ఆర్ఐ . శ్యాం నాయక్.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
నల్గొండ జిల్లా డిండి మండల ఆర్ ఐ . స్వామి నాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టు పడ్డాడు.
డిండి మండలంలోని చెరుపల్లి గ్రామ పడమటి తండాకు చెందిన లబ్ధిదారుల కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరుకై ఐదు వేలు డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు.
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో తన నివాసంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
కల్యాణ లక్ష్మి లబ్ధిదారుడు పాండు నాయక్ నుంచి మొదటి విడత గా 5000 రూపాయలు, రెండో విడతగా 5000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గతంలో కూడా పీఏ పల్లి ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్లు సమాచారం.
ఫైల్ పై సంతకం పెట్టకుండా రెండు సంవత్సరాలుగా వేధిస్తున్న శ్యామ్ నాయక్.
నల్గొండ ఏసీబీ డి.ఎస్.పి జగదీష్ చందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుండి సోదాలు కొనసాగుతున్నా కొనసాగుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App