TRINETHRAM NEWS

దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా మూడవసారి ప్రమాణ స్వీకారం

Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా దేవేంద్ర ఫడ్నవీస్ ఈరో జు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. మహా రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఆయన ప్రమాణస్వీ కారం చేయడం ఇది మూడోసారి.

ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రు లుగా ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహన్ తదితరులు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు.

వీరే కాకుండా వ్యాపార వర్గాల నుండి ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి ప్రము ఖులు హాజరయ్యారు. అలాగే సచిన్ టెండుల్కర్, షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ వంటి ప్రముఖులు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారో త్సవానికి హాజరైన వారి జాబితాలో ఉన్నారు.

మహాయుతి కూటమి నేతల్లో కీలక నేత అయిన ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీ కారం రోజున కూడా చివరి వరకు సస్పెన్స్ పెట్టారు. అదేంటంటే.. షిండే మహా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారా?లేదా? అనే విషయంలో స్పష్టత కొరవడింది.

ఆయన పదవుల పంపకాల విషయంలో కొంత అసంతృప్తితో ఉండటమే అందుకు కారణంగా వార్తలొచ్చాయి. ముందుగా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమే గట్టిగా ప్రయత్నించారని, అందుకే సీఎం ఎవరనే ప్రకటన ఆలస్యమైందని ప్రచారం జరిగింది.

దాంతో బీజేపి ప్రకటించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా వారికి తన మద్దతు ఉంటుందని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. కానీ ఆ తరువాత కూడా షిండే వ్యవహరించిన తీరు ఆయన ఇంకా అసంతృప్తి తోనే ఉన్నారనే వాదనలకు బలం చేకూర్చాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App