Trinethram News : ఈ రోజు గౌరవ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ముఖ్య అతిథులుగా బండారి లేఅవుట్, రోడ్ నెంబర్ -3బీ కమ్యూనిటీ హాల్ నందు హమారా కిడ్స్ 6వ వార్షికోత్సవ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పిల్లలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుభవం కలిగిన ఉపాధ్యాయలతో మంచి విద్యను అందిస్తున్న హమారా కిడ్స్ స్కూల్ యాజమాన్యనికి అభినందనలు తెలిపి, విద్యార్థులు చదువుతో పాటు, ఆట పాటలతో క్రమశిక్షణతో మెదిలి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హమారా కిడ్స్ స్కూల్ డైరెక్టర్ పడమజా అమర ,ప్రిన్సిపాల్ మాధవి, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఆనంద్ రెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు , మరియు వారి తల్లితండ్రులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
హమారా కిడ్స్ 6వ వార్షికోత్సవ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
Related Posts
రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు
TRINETHRAM NEWS రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్…
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…