నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మం జిల్లా :జనవరి 27
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలోపలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
మధిర మండలం బయ్యారంలో గ్రామ పంచాయతీ భవనం, చిలుకూరులో పాఠశాల భవనం, నిదానపురం, మాటూరులో ఆరోగ్య ఉపకేంద్రాలు, చింతకాని మండలం నాగులవంచల రైతు వేదిక, చిన్నమండ వలో ఆరోగ్య కేంద్రం, వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించ నున్నారు.
నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో, కోడుమూరులోని గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ సెంటర్లలో. అలాగే సాయంత్రం చింతకానిలో జరిగే అభినందన సభలో భట్టి పాల్గొంటారు.