నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నూతన సంవత్సరం 2024 లోకి (సోమవారం) నేడు అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకున్నారు.
2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.