ముక్కోటి ఏకాదశి సందర్బంగా పంచముఖి హనుమాన్, వెంకటేశ్వర స్వామి వార్లను దర్శనం చేసుకొన్న సీపీ
త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మందమర్రి లోని పంచముఖి హనుమాన్ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంకి చేరుకొన్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డిసిపి భాస్కర్ ఇతర పోలీస్ అధికారులు పూజారులు అనంత ఆచార్యులు, డింగరి కృష్ణకాంత్ చార్యులు, నరసింహ శాస్త్రి చార్యులు మంత్రోచ్ఛారణ నడుమ దర్శనం చేసుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిపి, డిసిపిలను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. భక్తుల ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కొరకు అన్ని ఆలయాల లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులు అందరూ ప్రశాంతంగా క్యూ లైన్లు పాటిస్తూ దైవ దర్శనం చేసుకోనీ ప్రశాంతంగా వెళ్లాలని కోరారు. ప్రజలు అందరు ప్రశాంతంగా, సుఖసంతోషాలతో ఉండాలని, అందరికి మంచి జరగాలని, అందరిపై ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
సీపీ వెంట బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, మందమర్రి సీఐ శశి ధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్, తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App