సొంతింటి పథకం అమలుకై ప్రభుత్వానికి సిఐటియు వినతిపత్రం
త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి
ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ చేస్తున్న దీర్ఘకాలిక పెండింగ్ అంశాల పరిష్కారానికై చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు తెలంగాణ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి భట్టి.విక్రమార్క మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి.శ్రీనివాస్ రెడ్డి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నాయకత్వంలో సొంత ఇంటి పథకం, అలవెన్సులపై ఐటి మాఫీ,మారు పేర్లు వంటి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరుతూ అన్ని బ్రాంచీల అధ్యక్ష కార్యదర్శులు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. సొంతింటి పథకం అమలు వలన అటు యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి ఎలాంటి భారం పడకుండా అమలవుతుందనే విషయాన్ని వివరించడంతో ఆయన సానుకూలత వ్యక్తం చేసి త్వరలో ఈ విషయంపై యూనియన్ తో మరొక సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో యూనియన్ సలహాదారు భూపాల్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ఉపాధ్యక్షులు మేదరి సారయ్య లు వివరించడం జరిగింది దీనికి వారు సానుకూలత వ్యక్తం చేస్తూ త్వరలో పరిష్కారం కొరకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి అల్లి రాజేందర్ శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గుల్ల.బాలాజీ అంబాల శ్రీనివాస్ RG-1 అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి.రాజమౌళి మేండే.శ్రీనివాస్ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ ఈద.వెంకటేశ్వర్లు, RG-2 అధ్యక్ష కార్యదర్శులు రాంప్రసాద్ కుంట ప్రవీణ్ కుమార్ RG-3 నుండి రవికుమార్,శ్రీనివాస్, కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి.శ్రీనివాసులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App