Trinethram News : పర్లాఖిమిడి
అక్రమంగా రవాణా చేస్తున్న వన్యప్రాణుల చర్మాలను గజపతి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి ఎస్. ఆనంద్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
జిల్లాలో వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నారు. దీంతో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది వివిధ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారన్నారు.
శనివారం రాయగడ సమితి మండలసాహి ప్రాంతంలో తనిఖీ చేపట్టగా అనుమానితులైన ముగ్గురి వద్ద నుంచి వన్యప్రాణుల చర్మాలు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మరో ముగ్గురికి ఇందులో సంబంధం ఉందని వీరి వద్ద నుంచి ఏడు వన్యప్రాణుల చర్మాలను 5 చిరుతపులి, చిరుతపులి పిల్లి(లియోపర్క్యాట్), బవురోపిల్లి చర్మం, 26.1 కిలోల అలుగు పొలుసులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు రాయగడ సమితికి చెందిన మోహన, ఆర్. ఉదయగిరిగా గుర్తించాం. వీరికి అంతరాష్ట్ర ముటాతో సంబంధాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వీరి వెనుకున్న ఉన్నవారిని పట్టుకుంటామని ఎస్ ఆనంద్ తెలిపారు.