TRINETHRAM NEWS

Calling dial 100,112 should increase people’s feeling and confidence that they are safe

రామగుండం పోలీస్ కమీషనరేట్

డయాల్ 100,112కి కాల్ చేస్తే తాము సురక్షితం అనే భావన, విశ్వాసాన్ని ప్రజలకు మరింత పెంపొందించాలి.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డయాల్ 100,112 కాల్ వచ్చిన వెంటనే స్పందించి తొందరగా సంఘటన స్థలాన్ని చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్.

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) గారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ లు బ్లూకోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందితో డయాల్ 100,112 కాల్స్ పై స్పందన వారి పనితీరు పై జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ … డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను చట్టపరిదిలో తీర్చాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విసేబుల్ పోలిసింగ్, ప్రోఆక్టివ్ పోలీసింగ్ ఉండాలి.

బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ మరియు రద్దీ ప్రాంతాల్లో, విసబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ నిర్వహించాలి. సమస్యాత్మక, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలేత్తే, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను ఎస్ హెచ్ ఓ లు సందర్శించాలి. శాంతి భద్రతల పరిరక్షణ మరియు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో డయాల్ 100, 112 టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసు సిబ్బందిపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సత్వర స్పందన, అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. డయాల్ 100,112 హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని ఆపదలో ఉన్న బాధితులు పోలీసుల సహాయం కోసం డయల్ 100 కి ఫోన్ చేస్తారని ప్రతి పోలీసులు గుర్తించాలి. డయాల్ 100,112 వచ్చే ఫోన్ కాల్ విషయంలో ఎస్ఐ, సీఐ ఏసీపీ ల పర్యవేక్షించాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Calling dial 100,112 should increase people's feeling and confidence that they are safe

డయల్ 100 కాల్స్ పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని బాధితులకు అందించిన సహాయాలను సైతం రికార్డు చేయడం జరుగుతుందన్నారు. సిబ్బందికి రివార్డ్ లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లు ప్రధాన పాత్ర పోషిస్తూ ,సిబ్బందితో కలిసి పట్టణంలలో, గ్రామాలలో డయాల్ 100, 112లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డయాల్ 100 కి కాల్ చేస్తే తాము సురక్షితంగా ఉన్నట్లు అనే భావన ప్రజలలో మరింత పెంపొందించాలన్నారు.

పోలీస్ శాఖ పై ప్రజలకున్న విశ్వాసాన్ని మరింత పెంచుతూ ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. డయాల్ 100 కాల్ వచ్చిన తర్వాత పోలీసులు బాధితులను చేరుకునే రెస్పాన్స్ సమయాన్ని తగ్గించాలని, తొందరగా సంఘటన స్థలాన్ని చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

జూ మీటింగ్ లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., పెద్దపల్లి డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, కమీషనరేట్ పరిధిలోని ఏసీపీ, సీఐ, ఎస్ఐ లు బ్లూకోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ సిసి అర్బీ బుద్దె స్వామి, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, పీసీఆర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్ఐ లు దామోదర్, మధు లు, ఎస్ఐ లు, పాల్గొన్నారు.