Trinethram News : Hyderabad : ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ /మండలికి ఆటోల్లో బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఏవీ అమలు కాలేదు. ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను అందించాం. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్న పోతు మీద వాన పడ్డట్లే ఉంది.
ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న పన్నెండు వేల రూపాయలను వెంటనే ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు, వెంటనే ఏర్పాటు చేయాలి.
ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతాం. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా మేము ఆటోల్లో అసెంబ్లీకి వెళ్తున్నాం. వారి యూనిఫాములు ధరించి వచ్చాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App