TRINETHRAM NEWS

భయం గుప్పిట్లో పోర్నో పొద్దర్ గ్రామం . ఆగని శిశు మరణాలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి:త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్. డిసెంబర్.31

అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయితీ పొర్నపొదొర్ గ్రామంలో,పాంగి.దాసు, జ్యోతి దంపతులకు జన్మించిన నాలుగు, మసాలా శిశువు వింత వ్యాధి తొ మృతి చెందింది, ఎగువశోభ పంచాయితీ పొర్నపొదొర్ గ్రామంలో శిశు మరణాలు అరికట్టాలని,!
మెడికల్ అధ్యయన బృందం కమిటీ ఏర్పాటు చేసి ఎందువలన మరణిస్తున్నారో నిర్ధారణ చేయాలని
అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమారు కి గ్రామస్తుల కోరుకుంటున్నారు.
ఎగువశోభ పంచాయితీ పరిధిలో గల పొర్నపొదొర్ గ్రామంలో పుట్టిన ప్రతి శిశువు ముడు, నుండి నాలుగు నెలల లోపు మరణిస్తుండడంతో గ్రామంలో గ్రామస్తులు తల్లిదండ్రులు భయం గుప్పిట్లో ఆందోళన చెందుతున్నారు.
పాంగి.దాసు, జ్యోతి దంపతులకు ఇప్పటికే 4 గురు శిశువులు మరణించడం మరింత భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే పొర్నపొదొర్ గ్రామంలో 14 మంది శిశువులు మరణించారు.
గతం నుండి జిల్లా అధికారులకు పిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం విషయంలో పర్యవేక్షణ లేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఫోన్ ద్వారా గ్రామంలో జరుగుతున్న శిశు మరణాలు కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం. గ్రామంలో మెడికల్ అధ్యయన బృందం కమిటీ ఏర్పాటు చేసి ఎందువలన మరణిస్తున్నారో నిర్ధారణ చేసి శిశు మరణాలు అరికట్టాలని కలెక్టర్ కి గ్రామస్తుల కోరుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కిల్లోమోస్య, ఎగువశోభ పంచాయితీ సర్పంచ్ కొర్ర.సింహాద్రి, అనంతగిరి సిపిఎం పార్టీ మండల నాయకుడు సోమెల.నాగులు, గ్రామాస్తులు చొంటరి కుమార్,సాగర.సన్యాసి , కుటుంబ సభ్యులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App