ఎమ్మెల్సీ కోదండరాం కు వినతిపత్రం ఇచ్చిన బస్తీ దవాఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు
హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుండా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లి పరిష్కరించాలని తెలంగాణ బస్తీ దవాఖాన లలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు ఎం.ఎల్.సి . కోదండరాం కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ బస్తీ దావఖన కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు మంగళపాటి సుమన్ , ప్రధాన కార్యదర్శి అంజాద్ అలీఖాన్ తెలిపారు.బస్తి దావఖన సపోర్టింగ్ స్టాఫ్ కు పెండింగ్ లో ఉన్న 4 నెలల వేతనాలు ఇప్పించాలని,ప్రతినెల సక్రమంగా వేతనాలు వచ్చేటట్లు చేయాలని, సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగ క్యాడర్ ను కేంద్రము లేదా రాష్ట్ర ఉద్యోగ క్యాడర్ గా గుర్తింపు చేయాలని మరియు కేంద్రం లేదా రాష్ట్రము వేతన విధానము వర్తింపజేయాలని,
2019 సంవత్సరం నుంచి నేటి వరకు సపోర్టింగ్ స్టాఫ్ వేతనాలలో మినహాయించి జమ చేయబడని పి.ఎఫ్. ఫండ్ సంబంధిత అకౌంట్లలో జమ చేయించాలని,బ్లడ్ శాంపిల్స్ రవాణా భత్యం ప్రతినెల రెగ్యులర్ గా వచ్చే టట్లు చేయాలని,కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాప్ ను ఏజెన్సీలకు అప్పగించుటను నిలుపుదల చేయాలని,సపోర్టింగ్ స్టాప్ ఇతర శాశ్వత లేదా తాత్కాలిక ఉద్యోగాల కొరకు పూర్తి వయస్సు సడలింపు మరియు పూర్తి సర్వీసు వెయిటేజీ మార్కులతో ప్రాధాన్యత ఇవ్వాలని,
ఏజెన్సీ విధానమును రద్దు చేసి కార్పొరేషన్ విధానమును అమలు పరచాలని బస్తి దావఖన సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు ఎం ఎల్. సి కోదండరాం దృష్టికి తీసుక వచ్చారు ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్లి బస్తీ దావఖన సపోర్టింగ్ సమస్యలను పరిష్కారం కొరకు కృషి చేస్తానని కోదండరాం తెలిపినట్లు సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగులు తెలిపారు ఇట్టి కార్యక్రమం లో కన్వీనర్ మెతుకు ఉప్పలయ్య, అడ్వైజర్ ఆకుల శ్రీనివాస్, సపోర్టింగ్ స్టాఫ్ శాంతమ్మ, పావని ,మహేష్, సాయి, గోవర్థిని తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App