ట్రాన్స్ జెండర్లకు స్వయం ఉపాధి మరియు రక్షణ పై అవగాహన
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష మరియు అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థల) జె. అరుణశ్రీ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి ఎన్. వేణుగోపాల్ మరియు జిల్లా పర్యవేక్షకులు కె. రాజయ్య జిల్లా సంక్షేమ కార్యాలయం నందు ట్ట్రాన్స్ జెండర్లకు స్వయం ఉపాధి, విద్య, ఆరోగ్య మరియు గృహ సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో ట్రాన్స్ జెండర్లకు రక్షణ మరియు సౌకర్యాలు కల్పిస్తామని సూచించారు. అదేవిధంగా జిల్లా మహిళ సాధికారత కేంద్ర బృందం సమాజంలో ట్రాన్స్ జెండర్లు ఎదుర్కుంటున్నటువంటి లింగ వివక్షత పట్ల ఎదుర్కుంటున్న సమస్యలపై, సామాజిక భద్రత, ఆర్థిక నిర్మూలన, స్వచ్చత, పరిసరాల పరిశుభ్రత, బ్యాంక్ రుణాలు, జీవిత భీమలు, ఆధార్ కార్డు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీడీపీవో ఆర్. అలేఖ్య పోషన్ అభియాన్ కోఆర్డినేటర్ శ్రీ. కె. అనిల్ కుమార్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ కౌన్సిలర్ సి.హెచ్. సమత, ట్రాన్స్ జెండర్స్ జిల్లా అధ్యక్షురాలు – కామేశ్వరి, కావ్య, సాలోని, లాస్య, అలకనంద, ధరణి దుర్గా తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App