TRINETHRAM NEWS

చంద్రబాబు అరెస్టుపై అట్టుడికిన అసెంబ్లీ

Trinethram News : ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ అరెస్టు దేశ రాజకీయాలలో సైతం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగానే చంద్రబాబును అరెస్టు చేశారని అప్పట్లో వైసీపీ నేతలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై టీడీపీ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీ హయాంలో చంద్రబాబుపై మహా కుట్ర జరిగిందని కోటంరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో పొరపాటు జరిగిందని తాను చెప్పలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. సీఐడీ, సీఎంవో, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్ళు మాయం కావడం, చంద్రబాబు అరెస్టు వెనుక జగన్ హస్తముందని ఆ అధికారి అభిప్రాయపడ్డ విషయాన్ని సభలో ప్రస్తావించారు.

అంతేకాకుండా, ఆ ఫైళ్లు మాయం కావడంతోపాటు, తన వాంగ్మూలంపైన విచారణ జరిపించాలని డీజీపీకి పీవీ రమేష్ లేఖ రాశారని గుర్తు చేశారు. అ లేఖపై విచారణపై గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఆ లేఖపై, విచారణపై కూటమి ప్రభుత్వం స్పందించాలని కోరారు. 53 రోజులపాటు అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారని, జీరో అవర్ పక్కన పెట్టి ఆ వ్యవహారం గురించి మాట్లాడాలని కోరారు. ఆ అంశంపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది చాలా సీరియస్ అంశమని, జీరో అవర్ లో దీనిపై సమాధానం కుదరలేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ అంశంపై చర్చిద్దామని స్పీకర్ రఘురామ సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App