TRINETHRAM NEWS

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Trinethram News : Telangana : బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ … హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశాలకు హాజరుకావాలని సభ్యులందరికీ సమాచారం అందించినట్టు వెల్లడించారు.

ముందు గా ఉదయం 10 గంటలకు క్యాబినెట్‌ సమావేశం సమావేశం ఏర్పాటుచేసి కులగణన నివేదిక, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణపై చర్చించి ఆమోదించనున్నారు. అసెంబ్లీలో చర్చించి, బీసీ రిజర్వేషన్లను పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎదురయ్యే ఆటంకాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Assembly