గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా వారి సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొనడం జరిగింది
రామగుండం ఏరియా-1 OCP-5 నందు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఘనంగా బోనాలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొనడం జరిగింది.. వారికి సింగరేణి అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలకడం జరిగింది..
అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగులందరూ వారి కుటుంబ సభ్యులు అమ్మ వారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరడం జరిగింది
అనంతరం ముఖ్య అతిథి మనాలి ఠాకూర్ గారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం,రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి ఉద్యోగులకు దసరా పండుగకి లాభాల వాటా 33 శాతం ఇవ్వడంలో కీలక పాత్ర వహించడం జరిగిందని అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు 5000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు..
సింగరేణి సహకారంతో ఎమ్మెల్యే కృషి ఫలితంగా త్వరలోనే 1×800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం కాబోతుంది
సింగరేణి కార్మికులు అంటే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అమితమైన ప్రేమ ఉన్నందునే మొట్టమొదటిసారి అసెంబ్లీకి సింగరేణి కార్మికుని దుస్తులు ధరించి వెళ్లడం జరిగింది అని వారి మీ కష్టాల్లో ఎప్పటికీ వెన్నంటు ఉంటారని చెప్పడం జరిగింది..
రామగుండం ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు క్యాతలబ్ సెంటర్, మేడిపల్లి OCP లో 500 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పడం జరిగింది
సింగరేణి కార్మికుల మంచినీటి కోసం సింగరేణి C&MD తో మాట్లాడి గ్రావిటీ ఫిల్టర్ ద్వారా త్వరలోనే కార్మిక కుటుంబాలకి రక్షిత మంచినీటిని అందివ్వబోతున్నామని తెలియజేశారు
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎప్పుడు సింగరేణి కార్మికులు బాగుండాలి వారు బాగుంటేనే ఊరు బాగుంటుంది అని తాపత్రయపడతారు కావున సింగరేణి కార్మికులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతారు అని చెప్పడం జరిగింది..
ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని అనుబంధ INTUC నాయకులు, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు,సింగరేణి అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App