TRINETHRAM NEWS

అరెస్టు చేసిన పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలి.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కన్వీనర్ నాగభూషణం. నాగర్ కర్నూల్ జిల్లా మై లారం గ్రామంలో గుట్టధ్వంసం చేయడానికి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన రిలేనిరహార దీక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్భంధం లో భాగంగా దీక్ష ప్రారంభానికి వెళుతున్న ప్రో. గడ్డం లక్ష్మణ్ ను,ప్రో. హరగోపాల్ గారిని వెల్దండ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.
గుట్టవిద్వంసం తో మైలారం గ్రామ ప్రజల జీవించేహక్కు ప్రమదంలో పడుతుందని,శాస్త్రవేత్తలు చెబుతున్న కానీ ప్రభుత్వం పెడచెవిన పెడు తున్నది. మైనింగ్ కి సంభందించి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మైనింగ్ చేయడానికి వీలు లేదు అని చట్టాలు చెబుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఎల్ఏ వంశీకృష్ణ లు కలిసి అక్రమానికి పాల్పడుతున్నారు. అంతేకాక ప్రాజశేయభద్దంగా నిరాహారదీక్ష చేయాలని అనుకున్న గ్రామస్తులను,హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ లను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా కన్వీనర్ నాగభూషణం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App