Arogyasree Services Bandh in AP from today
Trinethram News చేతులెత్తేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు!
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి నెట్ వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మంగళవారం రాత్రి స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషిషన్ (ఆశా) తో ఆరోగ్యశ్రీ సీఈవో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
నిన్న జరిగిన జూమ్ మీటింగ్లో ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని సీఈవో లక్ష్మీశా చెప్పినప్పటికీ గతంలో కూడా ఇదే చెప్పారని, వెంటనే బకాయిలు చెల్లించకుంటే రోగులకు చికిత్స అందించడాన్ని నిలిపివేస్తామని ఆశా స్పష్టం చేసింది.
నెట్ వర్క్ హాస్పిటల్స్లో రూ. 15 వందల కోట్లు పైగా ఆరోగ్యశ్రీ బిల్లులు 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని, బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించకపోవడంతో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నట్లు ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని స్పష్టం చేశారు.
అటు ప్రైవేట్ వైద్య కాలేజీల్లోనూ బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించబోమని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీస్ అసోసియేషన్ మంగళవారం ప్రకటన జారీ చేసింది. కొవిడ్-19 కింద అందించిన చికిత్స బిల్లులతో సహా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు సుమారు 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించడంలేదని, బకాయిలు చెల్లించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు అందించబోమని తెలిపారు.
మందుల ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చే వారికి మాత్రమే వైద్యం అందిస్తామని తెలిపారు. అలాగే వ్యాధి నిర్థారణ పరీక్షలకు 50 శాతం రాయితీ అందిస్తామన్నారు. సర్జరీలు కూడా ఉచితంగా చేస్తాన్నారు. ఇప్పటికే ఇన్పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం ఆరోగ్యశ్రీ కింద సేవలు కొనసాగిస్తామని తమ ప్రకటనలో వెల్లడించారు.
_ ఆరోగ్యశ్రీకి రూ.203 కోట్ల నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్.. అయినా ఆగని స్ట్రైక్!
ఏపీలోని నెట్వర్క్ హాస్పిటల్లో పెండింగ్ నిధులు విడుదల చేయాలంటూ నేటి నుంచి స్ట్రైక్ ప్రకటించిన నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరంగా రూ.203 కోట్ల నిధులు బుధవారం ఉదయం విడుదల చేసింది.
అయితే ప్రభుత్వ నిర్ణయంపై స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోషిషన్ (ఆశా) అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం బకాయిల్లో కేవలం రూ.203 కోట్లు విడుదల చేయడం ఏంటని ప్రశ్నిస్తుంది. మార్చ్ 31 వరకు ఉన్న పెండింగ్ నిధులు మొత్తం విడుదల చేసే వరకు స్ట్రైక్ కొనసాగుతుందని, అప్పటి వరకుఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని ఆశా తేల్చి చెప్పింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App