తెలంగాణ ఎరుకల ప్రజాసమితి మండల అధ్యక్షునిగా మానుపాటి శ్రీను నియామకం
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
తెలంగాణ ఎరుకల ప్రజా సమితి చొప్పదండి మండల కమిటీ అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు కెమసారం తిరుపతి ఆధ్వర్యంలో నియామకం చేసారు ఈ సందర్భంగా చొప్పదండి మండల అధ్యక్షుడు గా మానిపాటి శ్రీను ను నియమించారు.ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఎరుకల జాతి చైతన్యం కోసం ఎరుకల ప్రజా సమితి మరియు ఎరుకల మహిళా సమితి బలోపేతం కోసం,ఎరుకల జాతి అభివృద్ది కోసం పోరాటం చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బదనాపురం రాకేష్,ఉపాధ్యక్షుడు అంగిడి సంపత్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉండాడి అంజయ్య,సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మొగిలి,బిజిలి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App