Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది: నాదెండ్ల మనోహర్
మంగళగిరి: గత మంత్రివర్గ సమావేశంలో అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారని జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు..
ఆయా పరిశ్రమలకు భూ కేటాయింపులు విచిత్రంగా జరిగాయని ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు..
”రిటైల్ స్టోర్ మూసివేసే ముందు క్లియరెన్స్ సేల్ పెడతారు. వాళ్లు 70, 80 శాతం అని చెబుతుంటారు. ఉన్నవన్నీ అమ్మేసి దుకాణం మూసేస్తున్నామని మార్కెటింగ్ చేస్తుంటారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది. గతంలో కొన్ని కంపెనీలకు భూములు కేటాయిస్తే వాళ్లు ఏర్పాటు చేయలేమంటూ రద్దు చేసుకున్నారు. ఆ కంపెనీలకే మళ్లీ ఇప్పుడు భూములు కేటాయిస్తున్నారు” అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు..