TRINETHRAM NEWS

Trinethram News : ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత బండ్ల గణేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్‌బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఆయనకు సంవత్సరం జైలు శిక్ష విధించింది..

జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే ఆయనకు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.15,86, 550ల జరిమానా కూడా విధించింది..

25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్ కు షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. బండ్ల గణేష్ మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ టాలీవూడ్ లో సినీ కెరీర్ ను ప్రారంభించాడు. పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసాడు. ‘ఆంజనేయులు’ సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ స్థాపించి ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గబ్బర్ సింగ్’, ‘బాద్షా’, ‘టెంపర్’ వంటి చిత్రాలు నిర్మించాడు..