TRINETHRAM NEWS

An old woman threw a snake at the conductor for not stopping the bus

Trinethram News : హైదరాబాద్‌ : ఆగస్టు 09
చెయ్యెత్తినా ఆర్టీసీ బస్సును ఆపలేదని ఓ వృద్ధురాలు నానాహంగామా చేసింది. అధిక మోతాదులో మద్యం సేవించి, మత్తులో తూగు తూ ఖాళీ బీరు సీసాతో బస్సు అద్దం పగలగొట్టింది. తన వెంట తీసుకొచ్చిన పామును బస్సు కండక్టర్‌కి విసిరింది.

ఈ షాకింగ్‌ హైదరాబాద్‌ విద్యానగర్‌లో ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసు కుంది. సీఐ జగదీశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని నగరం లోని దమ్మాయిగూడకు చెందిన బేగం అలియాస్‌ ఫాతిమా బీబీ అలియాస్‌ అసీం (65) గురువారం సాయంత్రం విద్యానగర్‌ చౌరస్తాలో దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన 107 V/L నంబర్‌ బస్సును ఆపేందుకు చెయ్యెత్తింది. అదే సమ యంలో బస్సు సికింద్రాబాద్‌ నుంచి ఎల్బీనగర్‌ వైపునకు వెళ్తోంది.

విద్యానగర్‌ బస్టాఫ్‌ తర్వాత సిగ్నల్‌ ఫ్రీ లెఫ్ట్‌ వద్ద బస్సు తిరుగుతున్నప్పుడు సదరు మహిళ బస్సు ఆపేందుకు ప్రయత్నించింది. అయితే అది మూలమలుపు కావ టం, రద్దీగా ఉన్న కారణంగా డ్రైవర్‌ అక్కడ బస్సు ఆపలేదు.

దీంతో ఆగ్రహించిన ఆ వృద్ధురాలు తన వద్ద ఉన్న ఖాళీ బీరు సీసాను బస్సు పైకి విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలి పోయిం ది. గమనించిన డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపాగా.. అదే బస్సులో విధులు నిర్వ హిస్తోన్న మహిళా కండక్టర్‌ స్వప్న కిందకు దిగి ఆమెను పారిపోకుండా గట్టిగా పట్టుకుంది.

తప్పించుకోవడానికి ఆమె ప్రయత్నించినా సాధ్యపడ లేదు. దీంతో బేగం తన వద్ద ఉన్న సంచిలో పాము ఉందంటూ కండక్టర్‌ను బెదిరించింది.అయినా కండక్టర్‌ స్వన్న బెదరక పోవడంతో.. సంచిలో ఉన్న నాలుగు అడుగుల పొడవు న్న పామును జెర్రిపోతు బయటికి తీసి కండక్టర్‌పైకి విసిరింది.

అది స్వప్న ఒంటిమీద పడి నేలపైకి జారిపోయింది. సదరు మహిళ ఊహించని చర్యకు ప్రయాణికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ నల్లకుంట పీఎస్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని బేగంను అదు పులోకి తీసుకున్నారు. పాము కోసం వెతికినా దొరకలేదు. ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

An old woman threw a snake at the conductor for not stopping the bus