TRINETHRAM NEWS

నేషనల్ అచీవ్మెంట్ సర్వే (NAS)పరీక్షల పరిశీలన….

Trinethram News : ప్రకాశం జిల్లా….

కంభం: జాతీయ సాధన సర్వేలో భాగంగా మండలంలోని 7 పరీక్ష కేంద్రాలలో బుధవారం నిర్వహించిన పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ జాతీయ స్థాయి సామర్ధ్యాల అంచనా పరీక్షలను ఎంఈఓ-2 టి.శ్రీనివాసులు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, పరీక్ష కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించి,పరీక్షల నిర్వహణపై పరిశీలకులకు సూచనలు చేశారు.ఈ పరీక్షల ద్వారా జాతీయ స్థాయిలో విద్యార్థుల సామర్ధ్యాలను అంచనా వేయనున్నట్లు,సమగ్ర జ్ఞానాభివృద్ధిలో సామర్ధ్యాల అంచనాలను సమీక్షించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఆర్పీలు మురళీమోహన్, బాబూరావు,శైలజ, వై.శేఖర్,తరగతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App