TRINETHRAM NEWS

ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలింపు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్
అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు
వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
Trinethram News : Hyderabad : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు.

మరోవైపు వైద్య పరీక్షల కోసం బన్నీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బన్నీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇంకోవైపు, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్ చేరుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App