TRINETHRAM NEWS

Trinethram News : దేశవ్యాప్తంగా రైతు,కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా నేడు కుత్బుల్లాపూర్ లో షాపూర్ నగర్,ఐడీపీఎల్,బాచుపల్లి, గండి మైసమ్మ లో కార్మికులు పెద్దయెత్తున ర్యాలీ నిర్వహించి జయప్రదం చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, సీఐటీయూ అధ్యక్షుడు అశోక్ లు పాల్గొని మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరుస్తూ పేద, మధ్య తరగతి ప్రజల పై ధరల భారం పెంచుకుంటూ రైతులను,కార్మికులను కొత్త చట్టాల పేర మోసం చేస్తున్నారని అన్నారు.రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా కార్పోరేట్ శక్తులకు మాత్రం అనేక రాయితీలను కల్పిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కనీస పని గంటలు, కనీస వేతనాలు లాంటి చట్టాలను తొలగించి యాజమాన్యాల కు ఉపయోగపడే చట్టాలను తీసుకువచరని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్, సీఐటీయూ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం డ్రైవర్లు ప్రమాదం చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష,7 లక్షల జరిమాన విధించడం అనేది పిచ్చి ఆలోచనని వెంటనే ఇలాంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్,ఏఐటీయూసీ,సీఐటీయూ నాయకులు రాము,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు రాములు,ఆటో యూనియన్ నాయకులు కుమార్,ఎల్లస్వామి,చందర్,పూర్ణచందర్,ప్రభాకర్,బిల్డింగ్ వర్కర్స్ నాయకులు నాగప్ప, సామెల్,రవి,యాదగిరి,ప్రభాకర్,బాలరాజ్,మునిసిపల్ నాయకులు రాములు,పీటర్, నాయకులు సుంకిరెడ్డి,జెర్జ్,మహేందర్, కనకయ్య,చంద్రమౌళి, శ్రీనివాస్, గురప్ప,బాలాజీ తో పాటు వందలాది కార్మికులు పాల్గొన్నారు.

షాపూర్ నగర్ మార్కెట్ నుండి ఉషోదయం వరకు ఏఐటీయూసీ మరియు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఐడీపీఎల్ చౌరస్తా వద్ద ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది.