కమీషనరేట్ ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్ ని తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ అడ్మిన్
క్రమశిక్షణ తో కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు
ఏమైనా సమస్యలుంటే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు ఈ రోజు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు రామగుండం పోలీస్ కమీషనరేట్ అర్ముడ్ హెడ్ క్వార్టర్స్ లో వార్షిక తనిఖీ లలో భాగంగా సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు కి ముఖ్య అతిథి గా హాజరై వదనం స్వీకరించి తరువాత ఆర్మ్ డ్ రిజర్వ్/ సాయుధ దళాల సిబ్బంది టర్న్ అవుట్ పరిశీలించి కొంతమంది సిబ్బంది కి రివార్డ్ ప్రకటించడం జరిగింది. అనంతరం సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శించిన పరేడ్ పరిశీలించారు. తరువాత సిబ్బంది తో మాట్లాడి సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. సిబ్బంది చెప్పిన సమస్యలను మరియు పోలీస్ వెల్ఫేర్ లను కూడా త్వరలో పరిష్కారించడం జరుగుతుంది అని తెలిపారు. ఏఆర్ సిబ్బంది ఒక్క ఏఆర్ డ్యూటీనే కాకుండా సివిల్ సిబ్బంది కి సహాయం గా విధులు చేస్తున్నారన్నారు. క్రమశిక్షణతో పనిచేస్తూ ఆ రంగాలకు మంచి పేరు తెస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమానంగా పని చేస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావలన్నారు. క్రమశిక్షణ తో కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థానం లో ఉంటారన్నారు. అనంతరం ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్, ఆర్ఐ ఆఫీస్, రికార్డ్స్, బెల్లఫ్ ఆర్మ్స్, బీడీ టీమ్, డాగ్ స్క్వాడ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది డ్యూటీ ల గురించి అడగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసిపి ప్రతాప్ , ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, ఆర్ ఎస్ఐ లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App