Additional Collector of Local Bodies, J. Aruna, has taken necessary measures to improve sanitation in the town
మంథని, జూలై -02: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంథని పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు పరిచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ అన్నారు.
మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మంథని పట్టణంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు, నర్సరీ, పట్టణంలోని అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు.
అనంతరం మంథని పురపాలక శాఖ కార్యాలయంలో పట్టణ పారిశుద్ధ్య , అభివృద్ధి, గ్రీనరీ పనులపై మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం మెరుగు పరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. చెత్త తరలింపు రెగ్యులర్ గా జరగాలని, పారిశుధ్య ఇన్స్పెక్టర్ రెగ్యులర్ గా వార్డులను తనిఖీ చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
పట్టణంలో అవేన్యూ ప్లాంటేషన్ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ప్రస్తుత సీజన్ లో మొక్కలు పట్టణంలో నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పూర్తి చేయాలని అన్నారు.
అంతకుముందు మంథని పట్టణంలో మార్కెట్ యార్డ్, నూతన పురపాలక కార్యాలయం, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థలాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పరిశీలించారు.
ఈ సమావేశంలో మంథని మున్సిపల్ కమీషనర్ మల్లికార్జున్, మునిసిపల్ వైస్ చైర్మన్ బానయ్య, జిల్లా అటవీ అధికారి శివయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, వార్డ్ మెంబర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App