అబ్దుల్ కలాం తౌఫా ఏ తాలీమ్ పతకం ఇంకెప్పుడు అమలు…?
Trinethram News : మైనారిటీ విద్యార్థులకు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ పేరున అబ్దుల్ కలాం తౌఫా ఏ తాలీమ్ పతకం తెచ్చి ముస్లిం క్రిస్టియన్ ఇతర మైనారిటీ లకు ssc చేస్తే 10 వేలు, ఇంటర్మడియెట్ కు 15 వేలు, డిగ్రీ కు 25 వేలు, పీజీ కు లక్ష, phd, ఎం ఫిల్ కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం స్కాలర్ షిప్స్ ద్వారా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ అబ్దుల్ కలామ్ జన్మ దినాన్ని జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు కాబట్టి ఈ రోజు ఈ పథకాన్ని ప్రకటిస్తారేమో అని మైనారిటీ సమాజం ఎదురు చూస్తున్నారు కానీ అటు వైపు గా దృష్టి సారించాక పోవడం తీవ్ర నిరాశ కలిగించింది
విద్య దినోత్సవం సందర్భంగా మైనారిటీల నిరక్ష రస్యత పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
సచర్ కమిటీ స్పష్టంగా తెలిపిన విషయం మైనారిటీ ల అత్యంత వెనకబాటు ను జాతీయ సమస్యగా గుర్తించి చర్యలు తీసుకోవాలి అని నివేదించింది, ఇప్పటికీ సచార్ కమిటీ సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వము అమలు చెయ్యాలి
ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ఇచ్చిన హామీ అమలు పైన ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడం తో మైనారిటీ లకు హామీలు ఇవ్వాడమే కానీ అమలు చెయ్యడానికి కాదనే వాదన బలపడుతుంది కాబట్టి ప్రజా ప్రభుత్వం ఆ అపోహలను పోగొట్టుకుంటే మైనారిటీ ల్లో నమ్మకం కలుగుతుంది
మైనారిటీ లను ఓటు బ్యాంకు గా ఉపయోగించుకోవడం పార్టీలకు తగదని హితవు పలికారు తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర కోశాధికారి ఎండి షాదుల్లా
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App