భర్తను చంపిన భార్య.
డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.
కుటుంబ తగాదాల కారణంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన డిండి మండల పరిధిలోని దేవత్ పల్లి తండా లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిండి మండలం దేవత్ పల్లి తండా కు చెందిన రామావత్ కుమార్ కు చందంపేట మండలం పోలే నాయక్ తండాకు చెందిన లక్ష్మీ తో పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వ్యవసాయంతో పాటు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య కొన్ని నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి పొలంలో సాగుచేసిన వేరుశనగ పంటకు నీరు పెట్టడానికి కుమార్ భార్య లక్ష్మితో కలిసి వెళ్లాడు. ఎలాగైనా భర్తను అంతమంది చాలనుకున్న భార్య ఇతర వ్యక్తులతో కలిసి పథకం ప్రకారం పొలం వద్ద అర్ధరాత్రి మంచం పై పడుకున్నా రాళ్లు కర్రలతో దాడి చేసి చంపింది.
చీరతో అక్కడే ఉన్న వేప చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించింది.
తెల్లవారుజామున గ్రామంలోకి వచ్చి కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు మరియు గ్రామస్తులకు నమ్మ పలికింది.
ఘటనా స్థలానికి చేరుకున్న తండావాసులు కుమార్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి పరిశీలించగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న సీఐ సురేష్, ఎస్సై రాజుకు తన కుమారుడ్ని తన కోడలు కొట్టి చంపిందని, కుమార్ తల్లి సుకిని ఫిర్యాదు చేసింది ఈ మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నట్టు తెలిసింది ఈ హత్యలో భాగస్వామ్యం వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నా మనీ ఎస్సై తెలిపారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.