TRINETHRAM NEWS

విజయవంతంగా ఫోటోగ్రఫీ వర్క్ షాప్

ఫోటో వీడియో గ్రాఫర్లకు నూతన కెమెరాలపై అవగాహన

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా మరియు రామగుండం, ఎన్టిపిసి ,ఎఫ్ సి ఐ, అంతర్గాం ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్యూజి ఫిల్మ్ కంపనీ ఆధ్వర్యంలో స్థానిక అయాన్ష్ (సాయి లీల) బ్యాంకెట్ హాల్‌లో ఆర్ట్ ఆఫ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్యూజి ఫిల్మ్ కంపనీ మెంటర్ ఎస్.కె హుస్సేన్ నూతన కెమెరాలు, బిజినెస్ డెవలప్మెంట్ పై అవగాహన కల్పించారు. అనంతరం మోడల్ తో ఫోటో షూట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి , పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇర్ఫాన్ , ఉమ్మడి వరంగల్ జిల్లా & ఉమ్మడి కరీంనగర్ కుటుంబ భరోసా ఇంచార్జి సూరి బాబు , రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెర్ల ఉదయ్ , జిల్లా సలహాదారులు మోదంపల్లి రామస్వామి, రామగుండం అసోసియేషన్ అధ్యక్షులు అర్శనపల్లి రాజు ,ప్రధాన కార్యదర్శి గుమ్ముల నవీన్,కోశాధికారి మెండె శంకర్, ప్యూజి ఫిలిం కంపెనీ ప్రతినిధులు సత్య, రూపేష్ ,కళ్యాణ్ లతోపాటు సుమారు 150 మంది ఫోటో వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App