Trinethram News : తిరుమల
తిరుమలలోని పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు హాల్ చల్ చేసాయి. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ గంధం వనం వద్ద ఏనుగుల గుంపు వచ్చాయి.
శ్రీ గంధం వనం వద్ద ఏర్పాటు చేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టిటిడి అటవీ శాఖా అధికారులు ఘటనా స్థలంకు చేరుకున్నారు. ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు.
అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు. వేసవి ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతంను వదిలి బయటకు వచ్చినట్లు టిటిడి అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.