హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయగా, రూ.7 కోట్లకు ఒప్పదం కుదిరిందని పేర్కొన్నారు. విడతల వారీగా రూ.4 కోట్లు, రూ.3 కోట్లు చెల్లించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. కానీ, కోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని న్యాయవాది వెంకటరమణను.. యాదగిరి కోరారు. రూ.కోటి ఇచ్చారని, మిగలిన మొత్తం ఇవ్వకుండా మలక్‌పేట ఎమ్మెల్యే బలాలా, మరో వ్యక్తితో కలిసి బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు సీపీఎస్ పోలీసులను ఆశ్రయించగా.. ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు…..
సీనియర్ న్యాయవాది మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోద
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…