TRINETHRAM NEWS

Trinethram News : మహబూబ్‌నగర్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై ఏపీలోని తాడిపర్తికి వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డకుల వద్ద ఉన్నట్టుండి బైక్‌ ఆగిపోవడంతో.. మెకానిక్‌‌కు చూయించారు.
మెకానిక్‌ పరికరాలు విప్పుతుండగా పాము కనిపించింది. పామును రక్తపింజరగా గుర్తించారు. వారు పాముతోపాటు సుమారు 100 కి.మీ.పైగా ప్రయాణించారని షాక్ అయ్యారు.