షూలో దాగిన 3 అడుగుల నాగుపాము
షూలో ఉన్న పాము. బయటకు వచ్చిన దృశ్యం
Trinethram News : వేళచ్చేరి(తమళనాడు), న్యూస్‌టుడే: బూటులో 3 అడుగుల నాగుపాము దాగిన సంఘటన కడలూర్‌లో చోటుచేసుకుంది. కడలూర్ సిప్కాట్ సమీప చిన్నకారైక్కాడు గ్రామానికి చెందిన విజయబాలన్ సిప్కాట్ పారిశ్రామికవాడలో గుత్తేదారు. ఈయన శనివారం రాత్రి తన ఇంట్లోకి నాగుపాము ప్రవేశించడంతో దాన్ని చూసి బయటకు తరమడానికి యత్నించగా తప్పించుకుంది. అది పాదరక్షలు వదిలే చోటుకు వెళ్లి పిల్లలు పాఠశాలకు వేసుకెళ్లే బూట్లలో నక్కింది. ఉదయం గుర్తించిన విజయబాలన్ వెంటనే అటవీశాఖ సిబ్బందికి తెలియజేశారు. వారు అక్కడకు చేరుకుని బూటులో ఉన్న 3 అడుగుల పొడవు నాగుపాముని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App