జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Warning to Railway Passengers

Warning : రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టాన్ని జన విశ్వాస్ పేరిట సవరించింది. ఈ మారిన చట్టాల ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారికి రైల్వే రక్షక దళం (RPF) ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనుంది. కాజీపేటలో ఆర్పీఎఫ్ అధికారులు దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. టికెట్ లేని ప్రయాణం, మహిళల కోచ్‌లోకి ప్రవేశించడం, ధూమపానం వంటి పలు నేరాలకు జరిమానాలు భారీగా పెంచారు. ఫైన్ కట్టకుంటే కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపనున్నారు…

ట్రైన్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను పటిష్టం చేయడానికి, స్టేషన్లలో, రైళ్లలో క్రమశిక్షణను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాంగణాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా దశాబ్దాల నాటి 1989 రైల్వే చట్టంలో విప్లవాత్మక మార్పులు చేస్తూ సవరణలు తీసుకువచ్చింది. జన విశ్వాస్ పేరిట ప్రవేశపెట్టిన ఈ నూతన చట్ట సవరణల ద్వారా రైల్వే రక్షక దళానికి (RPF) అపరిమితమైన అధికారాలను కల్పించారు. గతంలో ఆర్పీఎఫ్ అధికారులకు నేరుగా జరిమానాలు వసూలు చేసే అధికారం ఉండేది కాదు. కానీ మారిన నిబంధనల ప్రకారం ఈ నెల 15వ తేదీ నుంచే ఆర్పీఎఫ్ సిబ్బంది తప్పు చేసిన వారికి అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించేలా చట్టాన్ని మార్చారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page