జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Applications invited for scholarships

scholarships Applications : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీకార్మికులు, సున్నపురాయి, డోలమైట్, ఐరన్, మాంగనీస్, క్రోమ్, అభ్రకం గనులతో పాటు చిత్ర పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలు.. కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర కార్మికశాఖ తెలిపింది.

ఒకటి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలు జాతీయ ఉపకారవేతనాల పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 1-10 తరగతి వరకు చదివే విద్యార్థులు ప్రీమెట్రిక్‌ ఉపకారవేతనాలకు ఆగస్టు 31లోగా, 11 నుంచి డిగ్రీ వరకు చదివే విద్యార్థులు అక్టోబరు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page