
Apprentice Mela : డిండి (గుండ్లపల్లి) జూన్ 03, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో అప్రెంట్రీస్ మేళా తేది 08- 06- 2026 రోజు ఉదయం 10గంటలకు డిండి ప్రభుత్వ ఐ టీ ఐ లో అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్ పి లక్ష్మణ స్వామి తెలిపారు. నల్గొండ జిల్లా , నాగర్ కర్నూలు జిల్లా, మరియు డిండి మండల పరిసర గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు 18సంవత్సరాల వయస్సు కలిగిన ఐటి ఐ చదివిన నిరుద్యోగులు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ( పి ఎం ఎన్ఎ ఎం) లో పాల్గొనాలని కోరారు.
ఈ అప్రెంటిస్ మేళా లో పలు గుర్తింపు పొందిన కంపెనీలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. అప్రెంటిస్ మేళాలో ఎంపికైన వారికి స్టైఫండ్ సదుపాయం వుంటుందన్నారు. ఈ మేలాకు వచ్చే అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ మరియు సర్టీ ఫికేట్స్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరాలకు 9492182944 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
