
TTD : తిరుమల, 02 జూన్ 2026:: టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమావేశం పద్మావతి అతిధి భవనంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో భాగంగా ఆయన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్‌కు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు, కళ్యాణి చౌల్ట్రీస్ మరియు సీఆర్ఓ లకు సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు.
తరువాత, ఎస్వీ మ్యూజియంకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. ఈ పనులన్నింటినీ నిర్దేశిత సమయం లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎస్ఈ వేణుగోపాల్, ఈఈలు శ్రీనివాసరావు, సుధాకర్, డీఈ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్, డిప్యూటీ ఈఓ హెల్త్ మరియు చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్ నారాయణ, డిప్యూటీ ఈఓ రిసెప్షన్ భాస్కర్, జీఎం ఐటీ వెంకటేశ్వర్లు నాయుడు, వీజీఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
