Night Travel : నరకంగా మారిన రాత్రి ప్రయాణం* రోడ్డుప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లు

TRINETHRAM NEWS
Night travel turned into hell

సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు*

Night Travel : దేవరకొండ డివిజన్ మే 20, త్రినేత్రం న్యూస్. రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోందనీ. ఎదురొచ్చే వాహనాల LED లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయి .కొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు. నియంత్రణ జాడ ఎక్కడ లేదనీ వాహనదారులు అంటున్నారు.
గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది.. అసలు ఆ రూల్ వుందో తీసేసారో కూడా తెలియట్లేదు . ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక….కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ ప్రజలు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు., కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న led లైట్స్ గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top