
Telugu Desam Party Foundation Day : దేవరకొండ డివిజన్ మార్చ్ 29, త్రినేత్రం న్యూస్. : తెలుగుదేశం పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది .
తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29న స్థాపించి కేవలం 9 నెలల లోనే అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు పరచి అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు రైతులకు విద్యుత్తు 50 రూపాయలకే అందించిన ఘనత అన్న ఎన్టీఆర్ ప్రతి పేదవానికి కూడు గూడు గుడ్డ అందినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని ఆరోజు ఎన్టీఆర్ చెప్పారు అదేవిధంగా తాలూకాలను రద్దుచేసి మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల దగ్గరకు పాలను తీసుకువచ్చినారు తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహాయుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కీర్తి ప్రతిష్టలు యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ ఆయన చూపించిన మార్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటిని ముందు తీసుకు వెళుతున్నారు అటువంటి పార్టీలో మేము ఉండడం మాకు ఎంతో గర్వకారణం అని అన్నారు .
తెలుగు వారు ఎక్కడున్నా ముందు వరసలో ఉండాలని కోరుకునే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అని అన్నారు .రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అమరేందర్ రెడ్డి , చందంపేట మండల అద్యక్షుడు బ్రహ్మ చారి, దేవరకొండ మండల అధ్యక్షుడు గార్లపాటి శ్రీను,గుడిపల్లి మండల అధ్యక్షుడు ఏలేటి నరసింహ,నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు బోడ దనయ్య, గార్లపాటి కృష్ణ ,చింతపల్లి మాజీ సర్పంచి కొమ్ము యాదయ్య జర్పుల జగన్ ,సత్యం ,రామాచారి ,శ్రీను యాదవ్,టీ ఎన్ ఎస్ ఎఫ్ నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు వస్కుల రాజేష్ ,తదితరులు పాల్గొన్నారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

