
మండల విద్యాధికారి :— పగిటి పాటి , నరసింహా.
10th Class Exams : డిండి (గుండ్లపల్లి) మార్చ్28, త్రినేత్రం న్యూస్. డిండి మండల వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు మండల విద్యాధికారి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. డిండి మండల వ్యాప్తంగా గణిత పరీక్షకు 376 మందికి గాను 375 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు.
ఈ మేరకు ఆయనతెలిపిన వివరాల ప్రకారం డిండి మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో 176 మందికి 175 మంది హాజరయ్యారని , తెలంగాణ గ్రామీణ ఆదర్శ పాఠశాల లో 200 మంది విద్యార్థులకు 200 మంది హాజరయ్యారని మండల విద్యాధికారి నరసింహ తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక ఎస్ఐ బాలకృష్ణ తమదిబ్బంది తో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

