TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలలో పంట నష్టం

తుఫాను ప్రభావంతో 7 మండలాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు.

పంట నష్టం జరిగిన మండలాల్లో గార మండలంలో 115 హెక్టార్లు, శ్రీకాకుళం మండలము లో 95, ఇచ్చాపురంలో 48, జి.సిగడాంలో 47, లావేరు 42, ఎచ్చెర్ల మండలంలో 34, కవిటి మండలంలో 7 హెక్టార్ల పంట నష్టం జరిగిందని గుర్తించారు.

దీనిని జిల్లాలో పంట నష్టం జరిగిన మండలాలుగా గుర్తించిన ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ సభలో రైతుల పేర్లు చదివి వినిపించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.